Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీ రిజర్వేషన్లపై న్యాయ సలహాకు కసరత్తు

బీసీ రిజర్వేషన్లపై న్యాయ సలహాకు కసరత్తు

- Advertisement -

– మంత్రుల కమిటీ భేటీ
– ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణుల్ని కలవాలని నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలనేదానిపై మంత్రుల కమిటీ కసరత్తు ప్రారంభించింది. రిజర్వేషన్‌ అమలు చేయడం ద్వారా తలెత్తనున్న అంశాలపై ఢిల్లీలోని ప్రముఖ న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డితో ఫోన్‌లో సంప్రదించారు. ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంత్రుల కమిటీ చైర్మెన్‌ మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయాంశాలపై కులగణన నిర్వహించిన సంగతి తెలిసిందే. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించాలంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అసెంబ్లీ ఎన్నికల్లో వాగ్ధానం చేశారు. ఆ వాగ్దానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఓబీసీ కులగణనను చేపట్టినట్టు మంత్రుల కమిటీ తెలిపింది. కులగణన పూర్తయిన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని నిర్ణయించింది. ఆ బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టి ఆమోదం తీసుకుంది. ఆ తర్వాత ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. ఆ బిల్లు గవర్నర్‌ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఐదు నెలలుగా బిల్లు పెండింగ్‌లో ఉన్నది. మరోవైపు సెప్టెంబర్‌ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ అంశాన్ని తేల్చేందుకు మంత్రుల కమిటీని ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -