- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు లీగల్ నోటీసులు పంపారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై భట్టి చేసిన వ్యాఖ్యల విషయంలో తన న్యాయవాది విజయకాంత్‌తో నోటీసులు పంపించారు. మూడు రోజుల్లో భట్టి బేషరతుగా క్షమాపణ చెప్పాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే రూ.25 కోట్ల పరువునష్టం దావా వేస్తామని.. క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు.
- Advertisement -