- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఓ చిరుత కలకలం రేపింది. పట్టపగలే పార్ది ప్రాంతంలోని నివాస ప్రాంతంలోకి ప్రవేశించి ప్రజలపై దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురు గాయపడ్డారు. చిరుతని చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దానికి మత్తుఇంజక్షన్ ఇచ్చి బంధించారు. అనంతరం అక్కడి నుంచి చిరుతను తరలించారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు చిరుత దాడిలో గాయాలపాలైనవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -



