అటవీ జంతువుల నుంచి రక్షించాలని చెంచుల ధర్నా
పెద్దదోర్నాల : నల్లమల అడవి అంచున ఉన్న పెద్దదోర్నాల మండలంలోని చిన్నారుట్ల చెంచు గిరిజన గూడెంలో చిన్నారిపై చిరుత పులి దాడి చేసింది. గ్రామస్తుల సమాచారం మేరకు… అడవి నుంచి గ్రామంలోకి చొరబడ్డ చిరుత పులి గూడెంలోని ఓ ఇంట్లో నిద్రిస్తున్న కుడుముల అంజయ్య, రాజేశ్వరి దంపతుల చిన్నారి (3)పై చిరుత దాడి చేసింది. చిన్నారి తలను పట్టుకుని అడవిలోకి చిరుత పులి తీసుకుపోతున్న సమయంలో అంజయ్య గమనించి గట్టిగా కేకలు వేశారు. అడవిలోకి పారిపోతున్న చిరుతను వెంబడించడంతో గ్రామ శివారులో చిన్నారిని వదిలిసి అడవిలోకి పారిపోయింది. తీవ్రగాయాల పాలైన చిన్నారిని సున్నిపెంట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల, మెడ భాగాల్లో గాయాలు ఉన్నప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
తమ గూడేనికి కరెంట్ సదుపాయం లేకపోవడంతో అటవీ జంతువులు తమపై దాడి చేస్తున్నాయని చెంచులు ధర్నాకు దిగారు. వెంటనే కరెంట్ సౌకర్యం కల్పించి అటవీ జంతువుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం ఉదయం పెద్దదోర్నాల -శ్రీశైలం రహదారిలో చిన్నారుట్ల చెంచుగూడెం వద్ద ధర్నా నిర్వహించారు. మూడేళ్ల పాపను చిరుతపులి తీసుకెళ్లడం తండ్రి గమనించకపోతే చనిపోయేదని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎఫ్‌ఆర్‌ఒ హరి ఈ విషయాన్ని ఫీల్డ్ డైరెక్టర్ సందీప్ కృపాకర్‌కు తెలియజేశారు.
ఆయనతో పాటు ఎస్‌ఐ ఆందోళన వద్దకు చేరుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో చెంచులు ధర్నా విరమించారు.
చిన్నారిపై చిరుత దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES