Wednesday, August 6, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పాఠాలు ఉపాధ్యాయులు లేక.. గ్రామస్తులు బడికి తాళం వేసి విద్యార్థులతో నిరసన..

పాఠాలు ఉపాధ్యాయులు లేక.. గ్రామస్తులు బడికి తాళం వేసి విద్యార్థులతో నిరసన..

- Advertisement -

నవతెలంగాణ కుభీర్ : బడిలో పాఠాలు బోధించే.. ఉపాధ్యాయులు ఉంటేనే విద్యార్థులకు మెరగైన విద్య బోధన అందుతుంది. కానీ ఇక్కడి సమస్య చూడానికి విరుద్దంగా ఉంది. పాఠశాలలో దాదాపుగా 55 మంది విద్యార్థులు పాఠశాలకు రోజు హాజరైతున్నారు. కానీ విద్యార్థులకు పాఠాలు బోదించే ఉపాధ్యాయులు ఒక్కరే ఉండడంటో సరైన విద్య బోధన అందడం లేదని కుభీర్ మండలంలోని  సాoగ్వి  గ్రామస్తులు బుధువారం విద్యార్థులతో కలసి గ్రామస్తులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయులు మాత్రమే ఉండడంతో చేసేది ఏమి లేకపోతే గ్రామస్తులందరు కలసి ఇద్దరు విద్య వాలెంటరీలను గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగించడంటో  వారికి గౌరవ వేతనం అందించడంలో ఆర్థిక భారముతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.దింతో ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.ఈ విషయం పై మండల విద్యాధికారి విజయ్ కుమార్ కు వివరణ అడగగా పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా అందులో నుంచి ఒక్క ఉపాధ్యాయురాలు మెటర్నీటి సెలువులో ఉన్నారు.ఒక్కరు విధులు నిర్వహిస్తున్నారు.విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని  సమస్యను పై అధికారుల వద్దకు తీసుకువెళ్లి పక్క పాఠశాల నుంచి రెండు రోజుల్లో ఒక్క ఉపాధ్యాయుడిని నియమిస్తామాని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -