Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఊరికి సేవ చేసే వాడిని గెలిపించండి 

ఊరికి సేవ చేసే వాడిని గెలిపించండి 

- Advertisement -

•ఈఎల్ వి  భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ 
నవతెలంగాణ-మర్రిగూడ
స్థానికంగా ఉంటూ నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండి గ్రామానికి సేవ చేసేవారిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఈ.ఎల్.వి భాస్కర్ అన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని రాజపేట తండా గ్రామపంచాయితీ సర్పంచ్ అభ్యర్థి కొండల్ ముదిరాజ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కేవలం ఎన్నికల సమయంలో కనబడే నాయకులను నమ్మొద్దని నిత్యం ప్రజల మధ్య ఉంటూ,ప్రజా సమస్యలు తెలిసిన నాయకులను గెలిపించుకోవాలని సూచించారు.

స్థానికుడు, విద్యావంతుడు, యువకుడైన కొండల్ ముదిరాజ్ ను డిసెంబర్ 11న జరగనున్న ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని ఓటర్లకు సూచించారు. పార్టీలకతీతంగా ప్రజలకు సేవ చేసే వారికి తమ ఫౌండేషన్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కొండల్ ను గెలిపిస్తే తమ ఫౌండేషన్ తరపున కూడా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మొదట ఫౌండేషన్ చైర్మన్ ఈ ఎల్ వి భాస్కర్ కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -