Monday, March 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅందరం కలిసుందాం మతసామరస్యాన్ని పెంపొందిద్దాం

అందరం కలిసుందాం మతసామరస్యాన్ని పెంపొందిద్దాం

- Advertisement -

అభివృద్ధిలో తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం : ఇఫ్తార్‌విందులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సోదరభావంతో మనమందరం కలిసిమెలిసి ఉందామనీ, మతసామరస్యాన్ని పెంపొందించుకుందామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. రంజాన్‌ అంటే కేవలం పండుగే కాదనీ, ఆత్మశుద్ధి చేసుకునే సమయమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదివారం సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. కార్యక్రమంలో సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహమ్మద్‌ అజహరుద్దీన్‌, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ,

సుదర్శన్‌ రెడ్డి, హర్కర వేణుగోపాల్‌, ఎంపీలు వేం నరేందర్‌ రెడ్డి ,అసదుద్దీన్‌ ఒవైసీ, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ముస్లిం మత పెద్దలు జామియా నిజామియా అమీర్‌ మౌలానా ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌ సాహెబ్‌, మౌలానా ముఫ్తీ సయీద్‌ సాదిఖ్‌ మొహియుద్దీన్‌, మౌలానా రిజ్వాన్‌ ఖురేషి (మక్కా మస్జిద్‌ ఖతీబ్‌), మౌలానా హఫీజ్‌ పీర్‌ ఖాలిక్‌ అహ్మద్‌ సబీర్‌, మౌలానా ముఫ్తీ గియాస్‌ అహ్మద్‌ రషాది, మౌలానా సయ్యద్‌ నిసార్‌ హుస్సేన్‌, మౌలానా ఖాలిద్‌ సైఫుల్లా రెహ్మానీ, డా. అహ్సాన్‌ అలీ హమూమీ, సయ్యద్‌ సాదతుల్లా హుస్సైనీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..మైనార్టీల సంక్షేమానికి తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి, సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవులు ఇచ్చామనీ, ఎనిమిది మంది మైనార్టీ నేతలకు కార్పొరేషన్‌ చైర్మెన్‌ పదవులు ఇచ్చామని వివరించారు. క్రికెటర్‌ సిరాజ్‌కు డీఎస్పీ, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్లు ఇచ్చి ప్రోత్సహించామని గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాల్లో ముస్లింలకు తగిన ప్రాధానత్య ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రతి కార్యక్రమంలో మైనార్టీలకు సింహ భాగం ఇస్తున్నామని తెలిపారు.

మైనార్టీ, మెజార్టీ అనే తేడా లేకుండా అంతా కలిసిమెలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌ హయాంలో మైనార్టీలకు కాంగ్రెస ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల ఎంతో ముస్లిం పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారని గుర్తుచేశారు. మీ ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారనీ, అప్రమత్తంగా ఉంటూ కలిసి మెలసి తెలంగాణ ను ముందుకు తీసుకెళ్దామని పిలుపు నిచ్చారు. దేశంలోనే తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని హామీనిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -