Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లేబర్ కోడ్ ల రద్దుకై ఐక్య పోరాటాలను నిర్మిద్దాం 

లేబర్ కోడ్ ల రద్దుకై ఐక్య పోరాటాలను నిర్మిద్దాం 

- Advertisement -

– సీఐటీయూ అఖిల భారత మహాసభల జెండా ఆవిష్కరణ 
– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కందరపు రాజనర్సు 
నవతెలంగాణ – కామారెడ్డి 

సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభల సందర్బంగా అఖిల భారత కమిటీ పిలువుమేరకు కార్మిక పోరాట పతాక సీఐటీయూ జెండా ఆవిష్కరణను సీఐటీయూ  జిల్లా వాటర్ వర్క్స్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కందరపురాజనర్సు మాట్లాడుతూ.. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు ఆంధ్రప్రదేశ్ లో విశాఖ పట్టణంలో మహాసభలు జరగనున్నాయనీ, లక్షలాది మంది కార్మికులతో ర్యాలీ బహిరంగ సభ ఉంటుందన్నారు. దేశ నలుమూలల నుండి 1600 మంది కార్మిక ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ మహాసభల్లో భారత కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపైన కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపైన చర్చించడం జరుగుతుందన్నారు.

సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో నిర్వహించబోయే పోరాటాలను రూపొందించడం జరుగుతుందనీ, కార్మిక ప్రజా సమస్యలపై పలు తీర్మానాలను చేయడం జరుగుతుందన్నారు.  కేంద్ర బిజెపి ప్రభుత్వం భారత కార్మిక వర్గం త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్ కోడ్ల ను తీసువచ్చిందన్నారు. 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచి కార్మికులను దోచుకునేందుకు అవకాశం కల్పించిందనీ, కార్మిక వర్గం కనీస వేతనం రూ 26,000/- డిమాండ్ చేస్తుంటే రోజుకు 173 రూపాయలు నిర్ణయించిందన్నారు.

బీజేపీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో నిర్వహించబోయే ఐక్య పోరాటాలకు మహాసభలు వేదిక కానున్నాయనీ, ఈ మహాసభలను కార్మిక వర్గం జయప్రదం చేయాలని ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు మీర్జా అయ్యాజ్ బేగ్, కార్యదరసి పోతారాం ప్రభాకర్, ఉపాధ్యక్షులు. ఎ .రాజు కాట్రాయాల శ్రీను, ప్రభు, కోశాధికారి ఎస్.నాగరాజు అగ్గిమల్ల స్వామి ఎస్, నవీన్ కుమార్, సహాయ కార్యదర్శులు కుమ్మరి నర్సిములు, ముదం కృష్ణ,  కోడి పేక రవి, నాయకులు కే సాయిలు, మహేష్, సాయి, పి మహేష్, డి చరణ్, టి రాజు, మహబూబ్  తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -