Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగిద్దాం

పోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగిద్దాం

- Advertisement -

– ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్వాతంత్య్ర పోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం 79వ పంద్రాగస్టు వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌. అరుణజ్యోతి అధ్యక్షతన జరిగిన సభలో లక్ష్మి మాట్లాడుతూ నాడు కుల, మతాలకతీతంగా స్వాతంత్య్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. ఎందరో వీరుల త్యాగాలతో స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఇన్నేండ్ల పరిపాలనలో మహిళల పరిస్థితి మెరుగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసమానతలు, వివక్ష కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దాడులు దౌర్జన్యాలు జరగుతూనే ఉన్నాయన్నారు. వీటికి వ్యతిరేకంగా, స్వాతంత్య పోరాట స్పూర్తితో హక్కుల సాధన కోసం ఐక్యంగా నిలబడుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎన్‌ ఆశలత, ఉపాధ్యక్షురాలు శశికళ, రాష్ట్ర నాయకురాలు లక్ష్మమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad