కందిపప్పు, శనగపప్పు సహా మరికొన్ని పప్పుధాన్యాలను ఇళ్లలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ప్రతి రోజూ వంటల్లో వాడుతుంటారు. అందుకే చాలా మంది ఎక్కువ మొత్తంలో కొనుక్కొని తెచ్చుకుంటుంటారు. ఇండ్లలో నిల్వ చేసుకుంటారు. అయితే, నిల్వ చేసిన పప్పుధాన్యాలకు పరుగులు పట్టే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉండటంవల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని వంటింటి చిట్కాల ద్వారా వీటికి పురుగు పట్టకుండా చేయవచ్చు
వేపాకులు
వేపాకులో పురుగులను నిరోధించే గుణం సహజంగా ఉంటుంది. కొన్ని వేపాకులను కాస్త ఆరబెట్టి తేమ పోయాక.. పప్పు ఉన్న డబ్బాలో వేయాలి.దీనివల్ల పప్పుకు పురుగులు పట్టకుండా చేయగలదు.
లవంగాలు
లవంగాలు కూడా పప్పులకు పురుగులు పట్టకుండా నిరోధించగలవు. లవంగాల్లోని ఘాటైన గుణం ఇందుకు సహకరిస్తుంది. పప్పుధాన్యాలు ఉన్న డబ్బాలో కొన్ని లవంగాలు వేసుకోవాలి. పురుగుల నిరోధించడంతో పాటు పప్పులను తాజాగా ఉంచేందుకు లవంగాలు తోడ్పడతాయి.
వెల్లుల్లి
వెల్లుల్లి కూడా పురుగులను నివారిస్తుంది. పప్పుధాన్యాలు ఉంచుకున్న డబ్బాలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేయాలి. ఓ మోస్తరు డబ్బాలో సుమారు 5 రెబ్బలను వేసుకోవాలి. వేసిన వెల్లుల్లి ఎండిపోతే వాటి స్థానంలో వేరేవి వేసుకోవాలి.
ఎండుమిర్చి
పప్పుధాన్యాలకు పురుగుల బెడదను ఎండుమిర్చి కూడా తగ్గించగలదు. నిల్వ చేసుకున్న పప్పుల్లో ఎండుమిర్చిని అలాగే వేస్తే పరుగులు పట్టే రిస్క్ తగ్గిపోతుంది.
ఎండ పెట్టాలి
ఒకవేళ అప్పటికే పరుగులు పడితే పప్పుధాన్యాలను ఎండలో ఆరబెట్టాలి. ఓ క్లాత్ పరిచి దానిపై ధాన్యాన్ని పోసుకోవాలి. నేరుగా ఎండ తగిలేలా ధాన్యాన్ని క్లాత్‌పై ఆరబెట్టాలి. దీనివల్ల పురుగులు తొలగిపోతాయి. ఒకవేళ ఎక్కువ రోజులు పప్పుధాన్యాలను నిల్వ చేయాల్సి వస్తే.. పురుగులు లేకపోయినా నెలకోసారి ఎండలో ఎండబెట్టుకోవటం మేలు. దీనివల్ల పప్పుల్లో ఏదైనా తేమ ఉన్నా పోతుంది.
ఇలా చేద్దాం…
- Advertisement -
- Advertisement -