– ఈనెల 5న కామారెడ్డికి మందకృష్ణ మాదిగ రాక
– వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు వేలాదిగా తరలి రండి
– వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజ్ గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హక్కుల కోసం పోరాడేందుకు ఈనెల ఐదున కామారెడ్డి జిల్లా కేంద్రానికి టెన్షన్ దారులు అందరు తరలి రావాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజు గూడ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం ఒకటి గంటకు మందకృష్ణ మాదిగ కామారెడ్డికి వస్తున్నారనీ, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు అందరూ ఈ సభకు తరలిరావాలన్నారు. ఈ సభ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్ దేవునిపల్లి రోడ్ లో పోయించడం జరుగుతుందన్నారు. సభా వేదికగా 4000 పెన్షన్ 6000 పెన్షన్, రెండు వేల పెన్షన్ 4000 పెన్షన్ కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటానికి వికలాంగుల సోదరులు, వృద్ధులు, వితంతువులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు.