Saturday, October 11, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఐసీడీఏస్ పరిరక్షణకై పోరాడుదాం

ఐసీడీఏస్ పరిరక్షణకై పోరాడుదాం

- Advertisement -

ఐసీడీఏస్ నిర్వీర్యం చేసేలా కుట్రలు
ఘనంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా మహాసభలు
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేష్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేసేల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టేల పోరాటలకు సన్నద్ధం కావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేష్ అన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై, ఐసిడిఎస్ పరిరక్షణకై పోరాడుదామని పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను  సీఐటీయూ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయం ఎదుట యూనియన్ జాతీయ కమిటీ సభ్యురాలు సునీత జెండాను ఆవిష్కరించారు.

అనంతరం బీటీర్ అన్నది వే పరిసర సత్యనారాయణ చిత్రపటాలకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దర్శనాల మల్లేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ సమావేశం నిర్వహించి పలు విషయాలపై చర్చించారు.  ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ… గర్భిణీలు, చిన్నారులకు అనేక సేవలు అందిస్తున్న ఐసీడీఎస్ స్త్రీ శిశు సంక్షేమ లక్ష్యాన్ని నీరుగార్చేందుకు ప్రతి ఏటా బడ్జెట్ ను తగ్గిస్తున్నారని ఆరోపించారు. ప్రైమరీ స్కూళ్లు, పీఎం శ్రీస్కూళ్లను అనుసంధానం చేసి అంగన్వాడీలను మూసివేసేల యత్నాలు సాగుతున్నాయన్నారు. వాటిని తిప్పికొట్టేల మహాసభల్లో వచ్చే మూడేళ్ల కోసం కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తు పోరాటలు చేసి ఐసీడీఎస్ ను పరిరక్షించుకుంటామన్నారు. 

ప్రభుత్వాలు విధానాలపైన చర్చించి సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో పోరాటాలను నిర్వహించేందుకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు ఈ మహాసభలు వేదికగా కానున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేయడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని అందులో భాగంగా పిఎంసి స్కూళ్లను తీసుకొచ్చి అంగన్వాడీలకు పోటీగా నిలిపిందని అన్నారు. ప్రతి బడ్జెట్లో ఐసిడిఎస్ కు నిధులను తగ్గిస్తూ నిర్వీర్యానికి పాల్పడుతుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అధికారంలోకి వస్తే 18 వేల రూపాయలు వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి మరిచిందని అన్నారు. అంగన్వాడి హక్కుల సాధన కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని అపోరాటాల్లో అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్ ఉపాధ్యక్షులు నైతం శోభ, లింగాల చిన్నన్న,అగ్గిమల్ల స్వామి, గంగన్న సహాయ కార్యదర్శి నవీన్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు సురేందర్, అంగన్వాడి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు డి.వెంకటమ్మ, కే. సునీత నాయకులు పద్మ కళావతి, సుజాత, సుభద్ర పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -