Thursday, December 4, 2025
E-PAPER
Homeఖమ్మంపొత్తు ధర్మం పాటిద్దాం

పొత్తు ధర్మం పాటిద్దాం

- Advertisement -

– వామపక్షాల ఐక్యత చాటిద్దాం
– సీపీఐ(ఎం),ఎంఎల్ మాస్ మాస్ లైన్ నాయకులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

రాజకీయ అవగాహన, వామపక్ష ఐక్యత కోసం స్థానిక ఎన్నికల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పారదర్శకంగా పొత్తు ధర్మం పాటించి, కమ్యునిస్టు ల ఐక్యతను చాటుదాం అని సీపీఐ(ఎం), ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య,గోకినపల్లి ప్రభాకర్ లు ఆయా పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు.

స్ధానిక ఎన్నికల నిర్వహణ కై ఈ రెండు పార్టీల మండల కమిటీల అత్యవసర సమావేశాలు గురువారం మండలంలోని నందిపాడు,కుడుములపాడు లో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బూర్జువా,పెట్టుబడిదారి పార్టీల కు ఎన్నికలు నిర్వాణ ఎలా ఉన్నా కమ్యూనిస్టులు గా ప్రలోభాలు,ప్రభావాలకు తలొగ్గకుండా ఉమ్మడి అభ్యర్ధులను గెలిపించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు గంగరాజు,మడిపల్లి వెంకటేశ్వరరావు,తగరం నిర్మల,కారం సూరిబాబు,నాగేశ్వరరావు,దుర్గారావు,సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు బుచ్చి రాజు,సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -