-సీపీఐ(ఎం) కు ఓటేయండి
-నర్సాయపల్లి సర్పంచు అభ్యర్థి సాలీ
నవతెలంగాణ – బల్మూరు
మండల పరిధిలోని నర్సాయపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సిపిఐ(ఎం) బలపరిచిన అభ్యర్థి మూడవత్ సాలీ ఉన్నారు. తనకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేసి మెజారిటీతో గెలిపించినట్లయితే గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. గతంలో గ్రామ సర్పంచ్ సిపిఐఎం ఉన్నారని అప్పుడు ఏకగ్రీవంగా దేశ్య నాయక్ ను ఎన్నుకున్నారని తెలిపారు. ఇప్పుడు మహిళకు అవకాశం వచ్చిందని గ్రామంలో మరింత అభివృద్ధి జరగాలంటే మరోసారి పార్టీకి అవకాశం కల్పించాలని గ్రామ సభల ప్రచారంలో కోరుతున్నారు. గ్రామంలో కనీస వసతులైన సిసి రోడ్ల నిర్మాణం నాణ్యతగా చేపట్టడం వెంటనే సైడ్ డ్రైన్లు ఏర్పాటు మురుగునీరు రోడ్లపై పారకుండా చర్యలు తీసుకుంటానన్నారు. గ్రామ పంచాయతీకి సంబంధించి వార్డు సభ్యులతో ప్రజల సమక్షంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామసభలు నిర్వహించి నిధులు నిలువలు ఖర్చులు వివరాలు నోటీసు బోర్డు పై ఉంచుతానని అన్నారు. గ్రామంలో ఉపాధి పనులు 100 రోజులు ప్రతి ఒరు చేసుకునేలా కూలీలకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళా సంఘాలకు లోన్లు ఇప్పించడం మరియు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వైద్య సేవలు అందేలా చూస్తానని అనారోగ్యాల బారిన పడిన వారిని సలహాలు సూచనలు సంప్రదింపులు చేస్తానని అన్నారు. పాఠశాల నిర్వహణ మధ్యాహ్నం విద్యా కమిటీ వాటిని సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గర్భిణీలు బాలింత స్త్రీలు శిశువులు, కిషోర బాలికల బాగోగులు చూస్తున్న అంగన్వాడి కేంద్రాలను మెరుగుపరిచి వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలుపుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమాలలో గ్రామ సిపిఐఎం నాయకులు కార్యకర్తలు ప్రజలు యువకులు పాల్గొంటున్నారు.
అభివృద్ధికి పాటు పడతా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



