- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహానికి దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇండ్లు, ప్రాజెక్టులను పరిశీలించడానికి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు. అందుకు తగిన నిధులు కేటాయించాలని సూచిస్తున్నామని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -