Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాయిగూడెం సర్పంచ్ గా గ్యార కవితను గెలిపిద్దాం 

సాయిగూడెం సర్పంచ్ గా గ్యార కవితను గెలిపిద్దాం 

- Advertisement -

ఎజాజ్ ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు 
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

గత పది ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోలేదని కేవలం కమిషన్లు వచ్చే పనులకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టి డబ్బులు దండుకున్నారని ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ తీవ్రంగా విమర్శించారు. ఆలేరు మండలంలోని సాయి గూడెం గ్రామ సర్పంచ్ గా గ్యార కవితను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు.సాయి గూడెం గ్రామంలోనికి వచ్చే రోడ్డు మొత్తం అధ్వానంగా ఉందని పదేళ్ల పాలల్లో బి ఆర్ ఎస్ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సన్న బియ్యం ఉచిత కరెంటు ఇంటికి 500 కే గ్యాస్  రుణమాఫీ రేషన్ కార్డులు సాయి గూడా దానికి గతంలో డబల్ బెడ్ రూమ్ రాలేదని ఇప్పుడు 12 ఇందిరమ్మ ఇండ్లు పేదలకు మంజూరయ్యాయి.

రాబోయే కాలంలో గ్రామంలోని ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత సర్పంచ్గా గ్యార కవితను గెలిపించినట్లయితే ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామంలో పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అన్నారు.సాయిగూడెం గ్రామాన్ని నియోజకవర్గంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తారని గ్యార కవిత ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు  ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆదరణ వస్తుందన్నారు. కవితని గెలిపించి బీర్ల ఐలయ్య కు కానుకగా ఇవ్వాలన్నారు.  గ్యార సరిత మాట్లాడుతూ తనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

తన గెలుపుకు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు గ్రామ ప్రజలందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ చింతకింది మురళి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి,సర్పంచి అభ్యర్థిగా పోటీ లో ఉన్న గ్యార కవిత సంపత్ పోటీలో ఉన్న వార్డు  మెంబర్లు  బీమగాని ప్రియాంక,ఊదరి రామకృష్ణ,బొమ్మల లావణ్య,మధుపాక సుశీల,గజ్జల శేఖర్,గోవింద్ స్వాతి,బయ్య జ్ఞానేందర్ బొడ్డు మల్లేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -