మోట కొండూరు అభివృద్ధి సాధిద్దాం
ఎగ్గిడి శ్రీశైలం రాష్ట్ర ఓబిసి కమిటీ మెంబర్
నవతెలంగాణ – ఆలేరు
మోటకొండూరు అభివృద్ధి పథంలో పయనంంచేందుకు కాంగ్రెస్, సీపీఐ (ఎం) బలపరిచిన భూమండ్ల జయమ్మ శ్రీనివాసులను గెలిపించాలని రాష్ట్ర ఓబిసి కమిటీ మెంబర్ ఎగ్గిడి శ్రీశైలం కోరారు. శనివారం మోటకొండూరు గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి మాట్లాడారు.నియోజకవర్గంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి జయమ్మ శ్రీనివాసు సర్పంచ్ గా గెలిస్తే ఎంపీ ఎమ్మెల్యే నిధులు మోటకొండూరు గ్రామానికి పెద్ద మొత్తంలో వస్తాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతో పాటు సన్నబియ్యం ఇందిరమ్మ ఇండ్లు రుణమాఫీ లాంటి పథకాల ద్వారా బిఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా ప్రజా పాలన ద్వారా ప్రజలకు చేరువైందన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదేశాల మేరకు మోట కొండూరు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోరుతూ బ్యాట్ గుర్తు పై ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు యాదగిరి తోపాటు పోటీలో ఉన్న సర్పంచ్ వార్డ్ మెంబర్లు సిపిఐ (ఎం) నాయకులు పాల్గొన్నట్లు చెప్పారు.



