నవతెలంగాణ – రామారెడ్డి
ఈనెల 5వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్ లో పింఛన్దారుల సన్నాహక సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నందున పింఛన్దారులంతా హాజరుకావాలని జిల్లా ఇన్చార్జి మంథని సామెల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వికలాంగుల, చేయూత పింఛన్దారులతో సమావేశాన్ని మండల అధ్యక్షులు ఎనకుర్తి రాజనర్సు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సామెల్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా పింఛన్దారులకు డబల్ చేస్తామని చెప్పి 18 నెలలు గడుస్తున్న హామీని నెరవేర్చకపోవడం బాధాకరమని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శైలేష్, సీనియర్ నాయకులు కొత్తల యాదగిరి, మహిళా నాయకులు లక్ష్మీ, బాణాపురం లావణ్య, పద్మ, తదితరులు ఉన్నారు.
5న పింఛన్దారుల సన్నాహక సభకు తరలి వెళ్దాం: ఎమ్మార్పీఎస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES