- Advertisement -
– సీఎంతో అమిటి వర్సిటీ ఛాన్సలర్ అతుల్ భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ విద్యారంగం, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వాములం అవుతామని అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ తెలిపారు. గురువారం ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో తమ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని చెప్పారు.
- Advertisement -