Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాల కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మనల్ని మనం కాపాడుకుందాం

వర్షాల కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మనల్ని మనం కాపాడుకుందాం

- Advertisement -
  • – మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి
  • నవతెలంగాణ – తిమ్మాజిపేట
  • భారీగా వర్షాలు కురుస్తున్నందున నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని మనల్ని మనం కాపాడుకుందామని నాగర్ కర్నూల్ మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి వాగులు, కాలువలు, నదులు రిజర్వాయర్లు చెరువుల వద్దకు వెళ్లారాదు గ్రామా ఆధికారులు ప్రజలను అప్రమత్తం చెయ్యాలి. నీరు అత్యధికంగా ప్రవహిస్తున్న ప్రాంతాల వద్దకు వెళ్లరాదు. నాలాలు, వాగులు ప్రవహిస్తున్న రహదారులు, రోడ్లు దాటరాదు. చెట్ల కింద పాడైన భవనాల కింద శిథిలావస్థలో ఉన్న భవనాల కింద, మట్టి మిద్దెలు ఉన్న ఇండ్లల్లో ఉండరాదు. కరెంటు స్తంభాలు ముట్టుకోరాదు. వర్షాలకు రహదారులు చిత్తడిగా ఉంటాయి కాబట్టి వాహనాలు నెమ్మదిగా నడపాలి. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి. వర్షాల కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం అని తెలిపారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -