Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసమిష్టి బాధ్యతతో పర్యావరణాన్ని కాపాడుకుందాం

సమిష్టి బాధ్యతతో పర్యావరణాన్ని కాపాడుకుందాం

- Advertisement -

– సరస్వతి పుష్కరాలను విజయవంతం చేద్దాం : పుష్కరాల పోస్టరావిష్కరణలో మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సరస్వతి పుష్కరాలను విజయ వంతం చేయాలనీ, వాటికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ సమిష్టిబాధ్యతగా తీసు కుని పర్యావరణాన్ని కాపాడుకుందామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపు నిచ్చారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26- వరకు జరగనున్న సరస్వతి నది పుష్కరాల కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు రూపొందించిన పోస్టర్‌ను బుధవారం సచివాలయంలో మంత్రి సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నదులను పరిరక్షించడం, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేదించడం, బట్టలుతకడం, వ్యర్థాలను సరిగ్గా నిర్వహించడం, నీటి కాలుష్యం నుంచి చర్మ వ్యాధులను నివారించడానికి పరిసరాలను శుభ్రంగా ఉంచడం అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రజా రవాణాను ఉపయోగించడం వల్ల వాహన కాలుష్యం తగ్గించొచ్చని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img