కడుపు కబుర్లు చెబుతుంది. కన్ను, ముక్కు, నాలుక, చెవి చర్మం అనే పంచ జ్ఞానేంద్రియాలు, వాక్కు, పని నడక వంటి క్రియలందించే చేతులు కాళ్ళూ, మలమూత్ర విసర్జనల వంటి కర్మేంద్రియాలు అన్నీ కలిస్తే మనిషి! నీ ఎముకలు నీ కండరాలు, నీలో జలసదశ్యంగా ప్రవహించే రక్తం, నువ్వు శ్వాసించే వాయువు, నీ ఆకలిలోని అగ్ని, గుండె ఊపిరితిత్తులు నీ నిర్దిష్ట పనులు చేసే అంతరావయవాలు, నువ్వు నిర్దేశిస్తే పనులు చేసే బాహ్యావయవాలూ, తల నుండి పాదాల వరకు ఉన్న అంగ ప్రత్యంగాలు. నీ వనే రూపుకు నవమాసాలు మోసి, అవయవాలు అన్నీ తయారుచేస్తుంది గర్భసంచి! తల్లి ప్రేమతో జాగ్రత్తగా నేల మీద పుట్టించే గర్భసంచి ఇన్నేసి అత్యవసర విషయాలను చెబుతుంది!! ”గర్భసంచిని కాపాడుకుందాం సమాజాన్ని బలపరుద్దాం” అనే పేరుతో మన ముందు ప్రత్యక్షమైన ఈ పుస్తకం ఎన్నో మంచి మంచి విషయాలను చెబుతున్నది. ఇందులోని అక్షరాక్షరం మీకోసం అందించిందంతా మనిషి జీవన విజ్ఞాన వికాసమే. ఈ పుస్తకం చదవడం మన మస్తకాలకు అత్యవసరం.