దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలబడిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) భవిష్యత్ నేడు అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసి పాలసీదార్ల నుంచి ప్రీమియంగా వసూలు చేసిన సొమ్ములో భారీ మొత్తం అదానీ షేర్లలో వెళ్లింది. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసి పెట్టిన పెట్టుబడులు 18వేల కోట్ల రూపాయలకుపైగా తరిగిపోయాయి.ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ వాణిజ్య గ్రూప్‌పై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు నిలు వునా పతనమయ్యాయి. ఈ దెబ్బ ఎల్‌ఐసిపై గట్టిగానే పడింది. అదానీ కంపెనీల్లో దేశంలో ఏ మ్యూచువల్ ఫండ్ చేయనంత భారీగా ఎల్‌ఐసి సరళంగా పెట్టుబడి పెట్టింది.వాస్తవానికి ఆ గ్రూప్ కంపెనీల్లో ప్రమోటర్ గౌతమ్ అదానీ తర్వాత పెద్ద ఇన్వెస్టర్ ఎల్‌ఐసీయే.
దేశంలోని టాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏ ఒక్కదానికీ అదానీ కంపెనీల్లో ఒకశాతం వాటా మించి లేదు. కానీ ఎల్‌ఐసికి ఐదు అదానీ కంపెనీల్లో ఒక శాతంపైగా వాటా ఉన్నది.గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో గౌతమ్ అదానీ తర్వాత పెద్ద ఇన్వెస్టర్ ఎల్‌ఐసీయే.అదానీ ఎంటర్‌ప్రైజెస్ తాజాగా జారీచేసిన 20వేల కోట్ల రూపాయల ఎఫ్‌పీవో పరిమాణంలో ఐదు శాతం షేర్లకు ఎల్‌ఐసి బిడ్ వేసింది.ఆ షేర్లను ఇప్పటికే ఎల్‌ఐసికి కంపెనీ కేటాయించేసింది కూడా. ఏ మ్యూచువల్ ఫండ్ అయినా,బీమా కంపెనీ అయినా ఒక కంపెనీలో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టేటప్పుడు సదరు కంపెనీ ఆర్థిక మూలాలను విశ్లేషిస్తూ క్రమ క్రమంగా పెట్టుబడులు పెడుతాయి. ఎల్‌ఐసి మాత్రం అదానీ గ్రూప్ కంపెనీల్లో జెట్ స్పీడ్‌తో పెట్టుబడులను పెంచుకుంటూ పోయింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 2021 జూన్ 30 నాటికి 1.32 శాతం వాటా ఉండగా, 2022 సెప్టెంబర్ 30 నాటికి 4.02 శాతానికి పెరిగింది.ఇదేరీతిలో అదానీ టోటల్‌గ్యాస్‌లో 2.11 శాతం నుంచి 5.77 శాతానికి,అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.42 శాతం నుంచి 3.46 శాతానికి ఏడాదికాలంలోనే పెంచుకుంది.ఈ షేర్లు ధరలు పెరుగుతున్న కొద్దీ ఎల్‌ఐసి కొనుగోలు చేయడం ఆశ్చర్యంగా ఉన్నది.ఇకపోతే అదానీ పోర్ట్స్‌లో మాత్రం ఎల్‌ఐసి వాటా 11.9 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గింది.ఏ కంపెనీలోనూ పది శాతానికి మించి పెట్టుబడులు చేయరాదన్న మ్యూచువల్ ఫండ్స్ నిబంధనకు అనుగుణంగా ఈ తగ్గింపు జరిగింది తప్ప మరో కారణం కాదు. ఇంకా పెద్దగా వాణిజ్య కార్య కలాపాలు ప్రారంభంకాని అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.15 శాతం వాటా ఎల్‌ఐసికి ఉన్నది. అదానీ పవర్‌లో ఒక శాతం మేర వాటా ఉన్నది.
వీటిలో మొత్తం పెట్టుబడుల విలువ 70వేల కోట్ల రూపాయలు.ఇవి కాకుండా ఇటీవల అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన అంబూజా సిమెంట్స్,ఏసీసీల్లో సైతం ఎల్‌ఐసీకి షేర్లున్నాయి.వీటి విలువ పదివేల కోట్ల రూపాయలకు పైనే.దేశ నిర్మాణంలో ఎల్‌ఐసి ముఖ్యపాత్ర పోషించి ఆర్థికశక్తి,దేశ నిర్మాణ ప్రాజెక్టులకు నిధులు, రైల్వేలు,విద్యుత్, రహదారులు, గహ నిర్మాణాలు, ఎన్‌టిపిసి కోసం నిధులు, బలహీన వర్గాలకు రక్షణ ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన,సామాజిక భద్రత క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 98శాతం కంటే ఎక్కువ ఈక్విటీ మార్కెట్‌కి మద్దతు, మార్కెట్‌లో అస్థిరత వచ్చినప్పుడు స్థిరత్వం ప్రభుత్వ డిజ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున పన్నులు, డివిడెండ్ చెల్లింపు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది.
ఒకరకంగా చెప్పాలంటే ఎల్‌ఐసి కేవలం బీమా కాదు అది దేశ నిర్మాణంలో భాగస్వామి.కానీ గత పదకొండేండ్ల కాలంగా మోడీ ప్రభుత్వం కార్పోరేట్ హిందుత్వ శక్తులకు అనుకూలంగా పాలన చేస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తున్న లౌకిక,ప్రజాస్వామిక శక్తులను ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తుంది.ఈ ప్రభుత్వం నయా ఫాసిస్టు విధానాలను అవలంబిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నది. మరోవైపు దేశంలో అసమానతలు, పేదరికం, నిరుద్యోగం,దారిద్య్రం, పౌష్టికాహారలోపం సమస్యలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నాయి. ఇంకొక వైపు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. కొనుగోలు శక్తి మాత్రం పెరగడం లేదు.ప్రభుత్వం కార్పోరేట్ పనులు తగ్గిస్తూ ప్రజా రక్షణ వ్యవస్థలను బలహీనపరుస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రయివేటు పరం చేయడం,పొదుపు చర్యల పేరు మీద ప్రజలపై భారాలు వేస్తోంది.
లక్షా 45వేల కోట్ల రూపాయలను కార్పోరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం పన్ను రాయితీలిచ్చింది. మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ,ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీల మాయాజాలం ఎల్‌ఐసి సంస్థను నష్టపరిచేలా చేస్తోంది. డిజిటల్ రంగంలో వస్తున్న మార్పులు సంస్థ అభివద్ధికి అడ్డుపడుతున్నాయి.సంస్థ ఈ రంగంలో వెనుకబాటును అధిగమించాలి.దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలి.కానీ ప్రభుత్వం ఈ వైపుగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది.దీని వలన ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకి మేలు జరుగుతోంది.ఈ విషయం ప్రభుత్వ రంగ బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థలో సైతం మనం చూశాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న అభివద్ధిని ఎల్‌ఐసికి కేంద్రం అందించి సంస్థను మరింత ఆధునీకరించకపోతే మన సంస్థ ప్రయివేటుతో పోటీ పడలేని స్థితిలోకి నెట్టబడుతుంది.
దేశంలోని యువతలో బీమా పట్ల అవగాహన కల్పించడంలో సైతం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. స్మార్ట్ సింపుల్,ప్లెక్సిబుల్ పాలసీలను మన సంస్థ ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి.ఎల్‌ఐసి పెట్టుబడులు ప్రధానంగా ప్రభుత్వ బాండ్లు,పబ్లిక్ ప్రాజెక్టులలో ఉంటాయి. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఎల్‌ఐసి పెట్టుబడులు ప్రమాదకర ప్రయివేటు సంస్థల్లోకి వెళుతున్నాయి. ఈ చర్యలు ప్రమాదకరమైనవి. దీర్ఘకాలంలో సంస్థకు,ప్రజలకు నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఎల్‌ఐసి అంటే ఒక నమ్మకం,ఒక విశ్వసనీయత కాబట్టి సంస్థను ఆధునీకరించుకుంటూ మరింత జాగ్రత్తతో ప్రజలకు సేవలందించాలి.దీనికి అవసరమైన సాంకేతికతను,పారదర్శకతను వినియోగదారులకు అందించాలి. వంద కోట్ల మంది దేశములో ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నారు.వీరందరికీ అవగాహన కల్పించి వారిని మన సంస్థ పరిధిలోకి తీసుకురావాలి.దీనికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి.దీనికి అవసరమైన సాంకేతికతను, పారదర్శకతను వినియోగదారులకు అందించాలి.
వందకోట్ల మంది దేశంలో ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నారు, వీరందరికీ అవగాహన కల్పించి వారిని మన సంస్థ పరిధిలోకి తీసుకురావాలి.దీనికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి.ఎల్‌ఐసి పాలసీలు తీసుకోవడం వలన దీర్ఘకాలంలో జరిగే మంచి ఏమిటో ప్రజలకు తెలియకపోవటం వలన ఇంకా కోట్లమంది ప్రజలు ఎల్‌ఐసి సేవలను అందుకోలేక పోతున్నారు.ఈ లోపాన్ని భవిష్యత్తులో సరిచేసు కోవాలి.ప్రజలకు అవగాహన కల్పించాలి.ఏజెంట్ ఆర్థిక భద్రత, కమీషన్ హక్కుల భద్రత వంటి విషయాలపై, పెన్షన్లు,గ్రాట్యూటీ తదితర చట్ట బద్ద హక్కులను అమలు చేయాలని పోరాడాలి. ఏజెంట్ల కోసం ప్రభుత్వం, సంస్థ ప్రత్యేకమైన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలి. సంస్థ పరిరక్షణకు, ఏజెంట్ల సంక్షేమానికి అవసరమైన హక్కులను సాధించుకోవాలి. దీనికోసం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలను సమన్వయం చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉద్యమం తీసుకురావాలి. మహిళా ఏజెంట్ల హక్కులు ప్రత్యేకమైన పరిరక్షణ కోసం నిలబడాలి. అనివార్యమైతే తప్ప అనియంత్రిత ప్రయివేటు కంపెనీలలోకి సంస్థ పెట్టుబడులు వెళ్లకుండా చూడాలి. సంస్థ పెట్టు బడులను ప్రధానంగా దేశ నిర్మాణ రంగంలోనే పెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటం కొనసాగించాలి.
డాక్టర్ సి.భారవి
9848505004



