Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత సత్తా చాటుదాం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత సత్తా చాటుదాం

- Advertisement -

రాకేష్ రాష్ట్ర కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శి 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత సత్తా చాటుదాం అని రాష్ట్ర కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శి రాకేష్ మరియు జిల్లా యూత్ అధ్యక్షులు ఇస్సార్ ఖాన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిత్తా క్రాంతి అధ్యక్షతన మండల యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాకేష్ మరియు ఇస్సార్ ఖాన్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మారం సుమన్ రెడ్డి  హాజరై స్థానిక సంస్థ ఎన్నికల్లో యువత సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. అనంతరం యువతను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో అవలంబించిన వ్యూహాలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలను మరియు బి ఆర్ ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేయవలసిందిగా కోరారు.

యూత్ కాంగ్రెస్ నాయకులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ఉన్న ప్రాముఖ్యత మరియు ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి యువతకు, అభ్యర్థులకు ప్రతి కార్యకర్త సహకారం అందిస్తూ, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని, యువత ఉత్సాహంగా పనిచేసే రాబోయే రోజుల్లో మంచి పదవుల్లో ఉంటారని అన్నారు .ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొంది కిరణ్,మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోరం రామ్మోహన్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, జక్కు రణదీప్ గౌడ్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి పొన్నం సాయి, యూత్ గ్రామ అధ్యక్షులు కొల్లు శ్రీనివాస్ రెడ్డి మరియు వివిధ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -