స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ చరిత్రలో స్వాతంత్య్రం వచ్చిన రోజును ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించారు. మాతభూమికి స్వేచ్ఛను బహుమానంగా ఇచ్చేందుకు తమ జీవితాలను ధైర్యంగా త్యాగం చేసిన దేశభక్తులను స్మరించుకోవడాన్ని స్వాతంత్య్ర దినోత్సవం ప్రతిబింబిస్తున్నదని తెలిపారు. అంకితభావంతో, నిస్వార్థంగా మన భవిష్యత్తు కోసం నిలిచిన వీరులకు నివాళులు అర్పించుకుంటున్నామని చెప్పారు. వారి త్యాగం స్వచ్ఛ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. జెండా వందనం చేసే సమయంలో మనమంతా బలోపేతమైన, స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర్ భారత్ కోసం పునరంకితమవుదామని గవర్నర్ సూచించారు. భారతదేశం ప్రగతిని, శాంతిని అందరికీ అందించాలని ఆకాంక్షించారు. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం మనమంతా ఐక్యంగా నిలబడుదామని పిలుపునిచ్చారు.
దేశం కోసం ఐక్యంగా నిలబడదాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES