జిల్లా ప్రాజెక్టు సూపర్వైజర్ జ్యోతి
విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి
నవతెలంగాణ – రామారెడ్డి
బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ప్రాజెక్ట్ సూపర్వైజర్ జ్యోతి అన్నారు. మంగళవారం మండలంలోని ఉప్పల్ వాయ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో విద్యార్థులకు బాల్య వివాహ ముక్తి భారత్ లో భాగంగా బాల్యవివాహాల నివారణ చట్టం 2006 పై అవగాహన నిర్వహించారు. చైల్డ్ వెల్ఫేర్ లైన్ సూపర్వైజర్ రజిత బాల్యవివాహాల చట్టం పై అవగాహన కల్పిస్తూ, చట్టపరమైన అంశాలు, ప్రమాదాలు, నివారణ చర్యల గురించి వివరించారు.
విద్యార్థుల చేత బాల్య వివాహాల నివారణ ప్రతిజ్ఞను చేయించారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతున్న బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి పౌరుడు ముందుకు రావాలని సూచించారు. అలాంటి ఘటనలు చోటు చేసుకున్న వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1098, 100, 112 కు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యానికి హానికరమని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివరాం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



