Friday, December 5, 2025
E-PAPER
Homeజిల్లాలునిజాయితీగా ఓటేద్దాం.. ప్రజాస్వామాన్ని కాపాడుదాం: కలెక్టర్ 

నిజాయితీగా ఓటేద్దాం.. ప్రజాస్వామాన్ని కాపాడుదాం: కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం
నిజాయితీగా ఓటేద్దాం ప్రజాస్వామాన్ని కాపాడుదామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావు అన్నారు. మండల కేంద్రంలోని శుక్రవారం స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మంచి సర్పంచ్, వార్డు మెంబర్ లను ఎన్నుకోవాలని, మంచి నాయకుడుని ఎన్నుకోవాలంటే మన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తాము అని ప్రలోభాలకి గురిచేసిన అలాంటి మాయ మాటలు నమ్మొద్దని. మనం ఓటు హక్కుని మద్యానికి, డబ్బులకి అమ్ముకోకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజశ్రీ విక్రమ్, తాసిల్దార్ శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై శ్రీశైలం సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -