Wednesday, July 30, 2025
E-PAPER
Homeజాతీయంకలిసి పనిచేద్దాం

కలిసి పనిచేద్దాం

- Advertisement -

– సింగపూర్‌ అధ్యక్షుడితో చంద్రబాబు
– డేటా సెంటర్లకు రాష్ట్రం అనుకూలమని పెట్టుబడిదారులకు వెల్లడి
అమరావతి :
పరస్పరం లాభదాయకత ప్రాతిపదికగా కలిసి పనిచేద్దామని సింగపూర్‌ అధ్యక్షుడు సింగపూర్‌ అధ్యక్షుడు ధర్మణ్‌ షణ్ముగ రత్నంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా సింగపూర్‌ అధ్యక్షుడితో పాటు సింగపూర్‌ అధ్యక్షుడితో భేటీమాజీ ప్రధాని ప్రస్తుత సీనియర్‌ మంత్రి లీ సైన్‌ లూంగ్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు.ఈ సమావేశాల్లో కలిసి పనిచేయడంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నాలెడ్జి ఎకానమీ, మౌలిక సదుపాయాల కల్పన, సెమీ కండక్టర్లు, అమరావతి అభివృద్ధి, అర్బన్‌ ప్లానింగ్‌, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సింగపూర్‌ భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. బాబు ప్రతిపాదనలను సాను కూలంగా పరిశీలిస్తామని సింగపూర్‌ నేతలు చెప్పినట్లు సమాచారం. పెట్టుబడిదారులతో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని బాబు చెప్పారు. దీనికోసం ప్రత్యేకించి ఎకోసిస్టమ్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి హాజరయ్యారు. వారిను ద్దేశించి మాట్లాడిన చంద్రబాబు గుగూల్‌ డేటా సెంటర్‌ విశాఖలో ఏర్పాటు కానుందని, టిసిఎస్‌, కాగ్నిజెంట్‌ సహా వివిధ ఐటి దిగ్గజ సంస్థలు వస్తున్నా యని పేర్కొన్నారు. దేశంలో తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారను. ఇప్పటికే రాష్ట్రంలో 20కిపైగా పారిశ్రామిక పాలసీలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎపిని ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ధృడనిశ్చయంతో ఉన్నామని, దీనికి సహకారం అందించానలి ఎఐ సింగపూర్‌ సంస్థను సిఎం కోరారు. ఎన్‌ఐఏ ఇంజనీరింగ్‌ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌జి జాన్‌లీన్‌ విలిన్‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర తీరంలో కాకినాడ మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను కలుపుతూ పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నట్తు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన జురాంగడ్‌ పెట్రో కెమికల్‌ ఐల్యాండ్‌ను సిఎం సందర్శించారు. అసుర్బానా జురాంగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ టియో ఎంగ్‌ కియాట్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అండీలీ ప్రాజెక్టు వివరాలు తెలిపారు. ముడిచమురు ప్రాసెసింగ్‌, పాలిమర్లు, ఇంధనాలు, స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ గురించి చెప్పారు. మూడువేల హెక్టార్ల సముద్రాన్ని భూమిగా మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో కెమికల్‌ హబ్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
భాగస్వాములవుతాం : సింగపూర్‌ మంత్రి టాన్సీలెంగ్‌ హామీ
ఎపి అభివృద్ధిలో సింగపూర్‌ భాగస్వామ్యం అవుతుందని, సింగపూర్‌ మానవ వనరులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి టాన్సీలెంగ్‌ ప్రకటించారు. ఎపి ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబునాయుడితో జరిగిన భేటీపై ఎక్స్‌ హ్యాండిల్‌లో ట్వీట్‌ చేశారు. వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పునరుత్పాదకత రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పారు. ఫుడ్‌ ఎంపైర్‌, ఎవర్‌వోల్ట్‌ లాంటి సంస్థలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. టాన్సీలెంగ ప్రకటనపై సిఎం చంద్రబాబునాయుడు స్పందించారు. వివిధ రంగాల్లో రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు టాన్‌సీలెంగ్‌తో కలిసి పనిచేసిన చర్చలు ఫలప్రదం అయ్యాయని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -