నవతెలంగాణ-హైదరాబాద్: గాజాలో ఇజ్రాయిల్ ‘ఆకలిని ఆయుధంగా’ వినియోగించడాన్ని ఖండిస్తూ 140 మంది ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆకలిని తీవ్రతరం చేసే ఏ పాలసీనైనా’ తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ సమాజం మరియు అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఇజ్రాయిల్‌తో ఆర్థిక, సాంస్కృతిక మరియు క్రీడా సంబంధాలను బహిష్కరించాలంటూ ప్రముఖ ప్రొఫెసర్లు, పరిశోధకులు మరియు ఇతర విద్యావేత్తలు సహా 140మంది ఆర్థిక వేత్తలు బుధవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు. ”ఆక్రమణ మరియు మారణహోమానికి నిధులు సమకూర్చే ఆర్థిక వ్యవస్థ” నుండి వైదొలగాలని పిలుపునిచ్చారు.
గత రెండేళ్లుగా ప్రజల జీవితాన్ని, సమాజాన్ని పాలస్తీనా భవిష్యత్తును తీవ్రంగా నాశనం చేసినందుకు ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచాలని అంతర్జాతీయ సమాజం మరియు అమెరికా ప్రభుత్వాన్ని ఆ ప్రకటనలో కోరాయి. 23మంది ప్రముఖ ఆర్థిక వేత్తలు ఇటీవల ఇజ్రాయిల్ ప్రధానికి మరియు నెస్సెట్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖలో ఇజ్రాయిల్ గాజాలో కరువు, స్థానభ్రంశం కొనసాగిస్తున్నట్లు పేర్కొంది కానీ గాజాలో యుద్ధానికి మూలకారణాలను ప్రస్తావించకుండా తప్పించుకుంది. గత 22 నెలలుగా అంతర్జాతీయ చట్టం, మానవహక్కులు మరియు అంతర్జాతీయ భద్రత సంస్థలు గతంలో కలిగి ఉన్న అర్థం, ప్రతివాదం మరియు ప్రభావాన్ని కోల్పోయిన చారిత్రక సమయమని వారు ప్రకటనలో నొక్కి చెప్పారు. గాజాస్ట్రిప్‌లో జీవన పరిస్థితులను దాదాపు పూర్తిగా ధ్వంసం చేయడానికి మరియు గాజాస్ట్రిప్, ఇజ్రాయిల్‌లో కొనసాగుతున్న జాతిప్రక్షాళనను పూర్తి చేయాలన్న బెదిరింపుల్లో ఇజ్రాయిల్ ప్రభుత్వ ప్రత్యక్ష బాధ్యతను విస్మరించలేమని అన్నారు. ఇజ్రాయిల్‌ను బాధ్యతగా చేయకుండా, గాజాలో ఆకలిని అడ్డుకోవాలని పిలుపునివ్వడం ఇజ్రాయిల్‌ను గాజాలో జాతి ప్రక్షాళనకు జవాబుదారీ కాకుండా కాపాడుతుందని పేర్కొన్నారు. రాబోయే దశాబ్దాల్లో పూర్తి వినాశనాన్ని మిగిల్చే యుద్ధ నేరాలకు రాబోయే దశాబ్దాల్లో శిక్ష లేకుండా చేయడమేనని పునరుద్ఘాటించారు.
గాజాలో వాస్తవ చిత్రీకరణలో ఆకలిని మరియు సాయాన్ని ఆయుధాలుగా వినియోగించడం ఎలా భాగమైందో కూడా ఆర్థిక వేత్తలు ప్రకటనలో వివరించారు. గాజాస్ట్రిప్‌లో ప్రస్తుత ఆకలి పరిస్థితులు అకస్మాత్తుగా వచ్చేవి కావు, ఊహించని పరిణామం కాదు. ఇవి ఇజ్రాయిల్ స్పష్టమైన ప్రణాళిక ఫలితం అని తెలిపింది. గాజాలో జాతి ప్రక్షాళన మరియు సామూహిక విధ్వంసం చేపట్టాలని బహిరంగంగా ప్రకటించి, ప్రపంచ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఇజ్రాయిల్‌లా కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలుగా, తాము ప్రతిచోటా ఉన్న సహోద్యోగులను మరియు అంతర్జాతీయ ప్రజాభిప్రాయాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి ఇజ్రాయిల్ ప్రపంచానికి ప్రజాస్వామ్యం ముఖచిత్రాన్ని ప్రదర్శిస్తోందని, కానీ ఇది జాతి ప్రక్షాళన, సామూహిక విధ్వంసం మరియు వినాశనాన్ని సృష్టిస్తోందని పేర్కొన్నారు. అవసరమైన వాటికి ప్రారంభమై యుద్ధానికి నిజమైన ముగింపు అని ఆర్థిక వేత్తలు స్పష్టం చేశారు.