Friday, November 14, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ లో ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు

ఆదిలాబాద్ లో ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఆధునిక విద్యాలయాలు గ్రంధాలయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈఓ రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంధాలయంలో వారోత్సవాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంధాలయ ఉపయోగాలు, తన పాత గుర్తులను పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈఓ రాజేశ్వర్ మాట్లాడుతూ.. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో లైబ్రెరీలు ఉండేవి కాదని, పట్టణ ప్రాంతాలకెళ్లి చదుకోవాల్సి వస్తుందన్నారు.

మారుతున్న కాలంతో పాటు సౌకర్యాలు కూడా పెరిగాయన్నారు. ప్రతి పల్లెలో కూడా గ్రంధాలయం ఉందన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థులకు ఇది మంచి వేదికలుగా నిలుస్తున్నాయన్నారు. మొబైల్ ఫోన్ ను పక్కన పెట్టి పుస్తక పాఠం చేస్త మంచి జ్ఞానం వస్తుందన్నారు. అదే విధంగా గ్రంధాలయంలో అనేక సమస్యలున్నాయని, జిల్లా యంత్రాంగం తరపున సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మెన్ మల్లెపూల నర్సయ్య, లైబ్రెరియన్లు శ్రీనివాస్, శివాజీ, మాజీ కౌన్స్ లర్ అంబకంటి అశోక్, కవులు బొల్లరం బాబన్న, మురళిధర్, సిబ్బంది, పోటీ పరీక్షల అభ్యర్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -