నవతెలంగాణ-కంఠేశ్వర్
భారతీయ జీవిత బీమా సంస్థ నిజామాబాద్ శాఖ ఆద్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి నిర్వహించిన ఎల్ ఐసి వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. వారోత్సవాల్లో భాగంగా ఎల్ ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గోపాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏజెంట్లకు ఉద్యోగులకు పాలసీదారులకు డాక్టర్ జి సాయి ప్రసాద్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అలాగే సుమారు 15 మందితో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు .. సుభాష్ నగర్ లోని బీసీ హాస్టల్ లో ఎల్ఐసి గురించి ఉపన్యాస పోటీలు నిర్వహించారు..గురువారం రాత్రి జరిగిన వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఏసీపీ రాజ వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవిత భీమా ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగం కావాలని అన్నారు. ఎల్ ఐసి మేనేజర్ సక్రు , ఏబీఎం కాశీనాథ్, ఇన్చార్జి రమణ,ఎల్ ఐ సి చీఫ్ అడ్వయిజర్ కోటగిరి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ముగిసిన ఎల్ఐసి వారోత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES