Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జీవిత భీమా మన కుటుంభానికి శ్రీరామ రక్ష..

జీవిత భీమా మన కుటుంభానికి శ్రీరామ రక్ష..

- Advertisement -

– ఈ.ఆర్.ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్
నవతెలంగాణ -ఆర్మూర్  : జీవిత బీమా మన కుటుంబానికి శ్రీరామరక్ష అని ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ అన్నారు. పట్టణ మహాలక్ష్మి కాలనీ వాసవి కన్యకాపరమేశ్వర కళ్యాణ మండపంలో సోమవారం  టాటా ఏ.ఐ.ఏ. ఇన్సూరెన్స్ ఏజెంట్ల రిక్రూట్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినారు . టాటా ఏ.ఐ.ఏ లైఫ్ ఇన్సూరెన్స్ హైద్రాబాద్ డివిజన్ హెడ్ లు నవీన్, సతీష్ గార్లు,ఆర్మూర్ బాధ్యులు రాజేంద్ర ప్రసాద్,రాజు గార్లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవిత బీమా మన కుటుంభానికి శ్రీరామ రక్షా అని ప్రతి ఒక్కరు జీవిత బీమా చేసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఎందుకంటే మన జీవితం ఏ క్షణం ఎటు తిరుగునో ఎవ్వరికి తెలియదు,ఈ మందుల కూడుకు ఏ రోగం ఎప్పుడూ వస్తుందో మనకు తెలియదు,చిన్న రోగం వస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు, అందుకే మనకు భీమా అత్యవసం,టాటా మన దేశంలో మంచి పేరొందిన సంస్థ,ఈరోజుల్లో కుటుంబంలో ఒకరి సంపాదనతో కుటుంబం గడవటం కష్టం ఇద్దరు కస్టపడితే గానీ నడిసే పరిస్థితి లేదు అందుకే టాటా ఇన్సూరెన్స్ ఏజెంట్ల రిక్రూట్మెంట్ అబ్బాయి లేకే కాకుండా అమ్మాయిలకు తన కాళ్ల మీద తాను నిలబడడానికి మంచి అవకాశం, కుటుంబానికి కూడా ఆసరాగా ఉంటుంది,మన సమాజంలో ప్రభుత్వ, పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగాల కల్పన చాలా తక్కువగా అయినవి,అందుకే ఇట్లాంటి సంస్థలలో పని చేసి మన సత్తా చాటాల్సిన అవసరం ఉంది,మన జీవితం సుఖమయం చేసుకోవాలి, ఎంత కస్ట పడితే అంత డబ్బు వస్తుందినీ కస్టమర్లకు భీమా అవశ్యకత సవివరంగా చెబితే తప్పక పాలసీ తీసుకుంటారని, టాటా సంస్థ ప్రతినిధులు ఏజెంట్లకు మంచి మెలుకువలు నేర్పించాలని రాజశేఖర్  కోరారు.   సంస్థ హెడ్ లు రాజశేఖర్ గారినీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్గుల్ సురేష్,డిష్ రాంప్రసాద్,సడక్ ప్రమోద్,కొండి రామచందర్, నవీన్ తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad