నవతెలంగాణ – హైదరాబాద్‌బ్యూరో
నిన్నటి వరకు సర్వీస్ చార్జీలు పెంచిన రవాణాశాఖ తాజాగా వాహనాల లైఫ్ టాక్స్‌ను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం జీవో ఎమ్‌ఎస్ నెంబర్-53 విడుదల చేసింది. గతానికంటే భిన్నంగా ఈ సారి వాహనాల ధర, జీవిత కాలాల్ని వేర్వేరుగా విభజించి లైఫ్‌ట్యాక్స్‌ను విధించారు. ఫలితంగా వాహనదారులపై ఆర్థికభారాలు భారీగా పెరగనున్నాయి. కొత్త చార్జీలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.50వేల లోపు ఖరీదైన టూవీలర్‌ను కొనుగోలు చేస్తే బండి ఖరీదులో 9 శాతాన్ని లైఫ్‌ట్యాక్స్‌గా చెల్లించాలి. సహజంగా మార్కెట్లో రూ.50వేల లోపు వాహనాలు లేని విషయం తెలిసిందే. అలాగే రూ.50వేల నుంచి రూ.లక్షవరకు ఉండే వాహనాలు 12 శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 15 శాతం, రూ.2 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే టూ వీలర్లకు 18 శాతం లైఫ్‌టాక్స్ విధిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే రెండో వాహనం ఉంటే దానిపై కూడా వాహన వయసును బట్టి టాక్స్‌ను నిర్ణయిస్తారు. ఉదాహరణకు రెండేండ్ల క్రితం రిజస్రేషన్ చేసుకున్న వాహనం మీకు ఉండి, కొత్తగా మరో వాహనాన్ని మీపేరు మీదే కొనుగోలు చేస్తే, కొత్త వాహనం ధరను బట్టి నిర్ణయించే లైఫ్ ట్యాక్స్‌తో పాటు పాత వాహనంపై అదనంగా మరో 8శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది. రెండో వాహనం వయసును బట్టి చెల్లించాల్సిన పన్ను శాతాల్లో మార్పులు ఉంటాయి. అలాగే రూ.5 లక్షల్లోపు కొత్త కారు కొంటే 13 శాతం, రూ5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటే 14 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటే 18 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కొనుగోలు చేసే కార్లపై 20 శాతం, ఆపై ఖరీదు ఉండే కార్లపై 21 శాతం చొప్పున లైఫ్‌టాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా రెండో కారు ఉంటే దానిపై కూడా అదనంగా పన్నును చెల్లించాలి. సదరు వాహనం వయసును బట్టి పన్ను శాతాలను నిర్థారించారు. లారీలు, బస్సులు, ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ట్రాన్స్‌పోర్ట్ వాహనాలన్నింటికీ లైఫ్ టాక్స్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES