- Advertisement -
ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇద్దరి పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదన్న నిబంధనను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ ఈ ఫైల్‌పై సంతకం పెట్టడంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా ….సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధనను తీసుకొచ్చారు.
- Advertisement -



