- Advertisement -
తేనెలో ఔషధ గుణాలు బోలెడున్నాయి. దానికి తోడు అదిరిపోయే రుచి. అది ఎనర్జీని కూడా ఇస్తుంది. అలాంటి తేనె ఉపయోగాలేమిటో తెలుసుకుందాం.
-దగ్గు వస్తోందా ఓ టీస్పూన్ తేనెను నిమ్మరసంలో కలిపి తాగండి. ఇక దగ్గు మటాష్. పగటి వేళల్లో తేనె, పాలు కలిపి తాగితే.. శరీర అలసట తగ్గుతుంది. ఎనర్జీ పెరుగుతుంది.
-శరీరంలో ఎక్కడైనా గాయాలుంటే.. తేనెను అక్కడ రాసి, నెమ్మదిగా మసాజ్ చెయ్యాలి. తేనె సహజమైన యాంటీబయోటిక్. రోజూ గాయంపై రాస్తుంటే, ఆటోమేటిక్‌గా నయమై పోతుంది. కాలిన గాయాల మీద తేనెను రాయాలి. అంతే.. మచ్చ కూడా లేకుండా గాయం మాయమవుతుంది.
-ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా.. మీరు తాగే టీలో ఓ స్పూన్ తేనె కలపండి.. టేస్ట్ ఆస్వాదిస్తూ తాగండి.. టెన్షన్ పరార్.
- Advertisement -



