Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సుభాష్ చంద్రబోస్ కాలనీలో మద్యం షాప్ తొలగించాలి

సుభాష్ చంద్రబోస్ కాలనీలో మద్యం షాప్ తొలగించాలి

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో గల సుభాష్ చంద్రబోస్ కాలనీలో కొనసాగుతున్న మద్యం దుకాణాన్ని అక్కడి నుండి తొలగించాలని బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ కార్యాలయంలో సూపరెండెంట్ కు వినతి పత్రం సమర్పించినట్లు గోపాల్పేట గ్రామస్తులు తెలిపారు. జనావాసాల మధ్య మద్యం దుకాణం ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. మద్యం దుకాణం అక్కడ నుంచి తొలగించి వేరే చోటుకు మార్చాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు వంశి గౌడ్,  సాయిలు, కమ్మరి రవి, ఫరీద్, వివేక్ రెడ్డి, రాములు, సంగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -