నవతెలంగాణ – కంఠేశ్వర్:
జిల్లాలో మద్యం షాపులను గురువారం మూసి ఉంచాలని సీపీ సాయిచైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరుగనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసిఉంచేలా చూడాలని ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నందున 4వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసిఉంచాలని ఆయన పేర్కొన్నారు. నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంతంగా జరుపుకునేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. దీంట్లో భాగంగానే మద్యం దుకాణాలను మూసి ఉంచుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయం నుండి గురువారం మధ్యాహ్నం దుకాణాలు బంధు ఉంచాలని బుధవారం ప్రకటన విడుదల చేశారు.
రేపు మద్యం దుకాణాల బంద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES