Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇసుక కోసం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల రాస్తారోకో

ఇసుక కోసం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల రాస్తారోకో

- Advertisement -

అధిక ధరకు ఇసుక… చర్యలు తీసుకోవాలని డిమాండ్
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)

ఇసుక ట్రాక్టర్ యజమానులు వారి ఇష్టారాజ్యంగా అధిక ధరకు ఇసుక విక్రయాలు చెయ్యడంతో ఆగ్రహించిన ఇందిరమ్మ లబ్ధిదారులు రహదారిపై రాస్తారోకో ఆందోళన నిర్వహించారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో ఉన్న బీర్కూర్ మండల పరివాహక ప్రాంతం నుంచి బాన్సువాడ నసురుల్లాబాద్, ఇతర ప్రాంతాలకు ఇసుకను అధిక ధరకు రవాణా చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకను అందిస్తామని ఒక దిక్కు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, మరోపక్క బీర్కూర్, చించోలి, దామరంచ, బరంగెడ్గి గ్రామాల టాక్టర్ల యజమానులు అధిక రేట్లకు ఇసుక అమ్ముతున్నారని ఆరోపిస్తూ మంగళవారం బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలోని  బీర్కూర్, బాన్సువాడ రహదారిపై  బైఠాయించి ఆందోళన చేశారు. 

ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ మంజీరా నదికి తమ గ్రామానికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న ఇసుక క్వారీ నుంచి మూడు వేలు వసూలు చెయ్యడం ఏమిటని ప్రశ్నించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ట్రాక్టర్ ఇసుక 1600 కి అందజేయాలని  లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఇసుక కోసం ప్రభుత్వంకు 900 డిడి రూపంలో చెల్లించగా ట్రాక్టర్ యజమానులు బాన్సువాడకు నసురుల్లాబాద్ ఇతర గ్రామాలకు 35 వందలను వసూలు చేస్తున్నారు. లబ్ధిదారుల నుండి బలవంతంగా ఇసుక ట్రాక్టర్ యజమానులు అధిక ధరలను వసూలు చేస్తున్నప్పటికీ స్థానిక తాసిదారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. అధిక ధరలకు ఇసుక అమ్ముకు అమ్ముతున్నారంటూ లబ్ధిదారుల మండిపడ్డారు.

బీర్కూర్, బాన్సువాడ రహదారిపై  వాహనాలు నిలిచిపోయాయి. ఇసుక ట్రాక్టర్ యజమానులు  ఒక ట్రాక్టర్‌ ఇసుక తరలించేందుకు అనుమతి పొంది, అదే కూపన్‌పై అధికారుల కన్నుగప్పి రోజుకు నాలుగు నుంచి అయిదు ట్రిప్పులు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ఈ రవాణాపై అధికారుల  నిఘా లేకపోవడంతో.. వారి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకుంటూనే మధ్యతరగతి కుటుంబాలకు ఇసుక తక్కువ ధరకు లభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
బాన్సువాడ సబ్ కలెక్టర్ స్థానిక తహసిల్దార్ చొరవ తీసుకొని అధిక ధరకు విక్రయిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానుల ఆగడాలను అరికట్టాలని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -