యువజన సాహిత్యోత్సవం
సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ నవంబర్ 22 2025 శనివారం వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో Words Against Walls పేరుతో Youth Literature Festival 2025. ఇందులో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా ప్రముఖ సమకాలీన కవులు రచయితల, మరీ ముఖ్యంగా దాదాపు 60 మంది యువ రచయితలు విద్యార్థులు పాల్గొనే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. వివిధ వేదికలపై 12 సమాంతర సెషన్లలో మూడు తరాల గొంతుకలు తమ రచనానుభవాలు వినిపిస్తాయి. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా తమిళ రచయిత్రి సుకీర్త రాణి, ఆత్మీయ అతిథిగా మహిళా విశ్వవిద్యాలయం విసి ప్రొ. సూర్యా ధనంజయ్, డార్జిలింగ్ కి చెందిన నేపాలీ ధిక్కార కవి మనోజ్ బోగటితో ప్రత్యేక సెషన్, కవిత్వంతో సంభాషణలో ముప్పై మంది యువకవులు సీనియర్ కవులతో, కథతో ప్రయాణంలో మరో ముప్పై మంది యువ కథకులు సీనియర్ కథా రచయితలతో సంభాషిస్తారు. సంప్రదించడానికి :9052809952.
-మెర్సీ మార్గరెట్, సెక్రెటరీ, సమూహ యూత్ లిటరేచర్ ఆర్గనైజింగ్ కమిటీ
22, 23 తేదీలలో విజయవాడలో సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు
ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ నిర్వహణలో నవంబరు 22, 23 తేదీలలో జాతీయ సాంస్కతిక ఉత్సవాలు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరుగుతాయి. రెండురోజుల ఈ ఉత్సవాలకు డా.జి.లక్ష్మీ, కందుల దుర్గేష్, బుద్ధప్రసాద్, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, డా. పాపినేని శివశంకర్, ఆచార్య డి. మునిరత్నం నాయుడు, ఆర్.డి.విల్సన్, జి. లక్ష్మీనరసయ్య, ఖాదర్ మొహియుద్దీన్, ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి, ఆచార్య జి.వి.రత్నాకర్, బిక్కి కృష్ణ, ముంజులూరి కృష్ణకుమారి, డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, శ్రీరామకవచం సాగర్, పి.చంద్రశేఖర అజాద్, చిన్ని నారాయణరావు, డా. బీరం సుందరరావు, గుమ్మడి గోపాలకృష్ణ, పొడపాటి తేజస్వి, సత్యాజీ, పుప్పాల శ్రీరామ్, పి.శ్రీనివాస్ గౌడ్, కొమ్మవరపు విల్సన్ రావు, వేంపల్లె షరీఫ్, బండ్ల మాధవరావు, అవధానుల మణిబాబు పాల్గొంటారు. నాలుగు రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొంటారు . పల్లెపాటలు, ఏకపాత్రలు, వివిధ కళారూపాల ప్రదర్శనలు, చిన్నారుల నత్యాలు, పుస్తకావిష్కరణలు కవి సమ్మేళనాలతో కార్యక్రమం రెండురోజులపాటు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటలవరకు జరుగుతుంది. ఈ సందర్భంగా కథలు, కవితలు, కార్టూన్లపోటీలో ఎంపికైన రచనలతో జాతీయ సాంస్కృతిక ఉత్సవాల ప్రత్యేక సంచికను ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ఆవిష్కరిస్తారు. బహుమతీ గ్రహీతలకు నగదు బహుమతులు అందజేస్తారు.
-కలిమిశ్రీ, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షులు
రొట్టమాకరేవు కవిత్వ అవార్డు సభ
‘రొట్టమాకురేవు కవిత్వ అవార్డు’ సభ ఈ నెల 23న సాయంత్రం 6 గంటలకు పైడి జైరాజ్ హాల్, రవీంద్రభారతి, హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సభలో నాలుగు కవితా సంపుటాలకు ప్రదానం చేస్తారు. అందులో భాగంగా ఈ 2025 సంవత్సరపు అవార్డుకోసం 2022, 23, 24 సంవత్సరాలలో వెలువడిన కవితాసంపుటుల నుండి కమిటీ ఎంపికచేసిన నాలుగు కవితాసంపుటులు ఇవి: 1. షేక్ మహమ్మద్ మియా స్మారక అవార్డు: నల్లకొడిసె వన్నెకాడు – నాగిళ్ళ రమేశ్, 2. పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డు: తెలంగాణి – జూపాక సుభద్ర, 3. కె. ఎల్. నరసింహారావు స్మారక అవార్డు: -కలల రంగు – రహీమొద్దీన్, -నీటిగింజల పంట – కంచరాన భుజంగరావు.
-కవి యాకూబ్
స్నిగ్ధా రెడ్డి బాలసాహిత్య పురస్కారం 2026
వీూూ స్నిగ్ధారెడ్డి జ్ఞాపకార్థం బాలసాహిత్య వేత్తలకు నగదు పురస్కారం అందజేయాలని వారి కుటుంబం సంకల్పించింది.బాలసాహిత్య కవులను, రచయితలను వారు ప్రచురించిన పుస్తకాలను పంపవలసినదిగా కోరుతున్నాం. 2023, 2024, 2025 సంవత్సరాల్లో ప్రచురితమైన బాలసాహిత్యం పుస్తకాలను రెండు కాపీలను డిసెంబర్ 31 లోగా ‘అరుణ నాయుడు తోట, NCL LB గోదావరి, సి – బ్లాక్ #-502, పైప్ లైన్ రోడ్, జీడిమెట్ల, హైదరాబాద్-67’ చిరునామాకు పంపాలి. ఫోన్ :63019 30055.
-శాంతికృష్ణ & టీం, తెలుగు సాహితీవన సమూహం
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -


