డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రచనలపై 10న సదస్సు
ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం- జానుడి సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్, ఒంగోలు సంయుక్త ఆధ్వర్యంలో ‘డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సైన్స్ రచనలపై ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులోఆచార్య డివిఆర్ మూర్తి, రోణంకి గోపాలకష్ణ, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ పాల్గొంటారు. అత్యున్నత కళారూపం సైన్స్, ఆధునికతకు చిరునామా సైన్స్, ప్రకతి – వికతి డ ప్రకతి – పర్యావరణం, భారతదేశ తొలి వనితా వైద్యులు, జ్యోతిష్మతి, సైన్స్ క్యాలెండర్, సైన్స్ వైతాళికులు, సైన్స్ ధ్రువతారలు తదితర పుస్తకాలపై సమాలోచన ఉంటుంది. పలువురు విశ్లేషకులు ఈ పుస్తకాలపై ప్రసంగిస్తారు
డా||ఎన్. రవికుమార్, జానుడి 9848187416.
కుందుర్తి పురస్కారం
ఫ్రీవర్స్ ఫ్రంట్ డ హోరు ఆధ్వర్యంలో ఈ నెల 13న ఉదయం 10గంటల నుంచి ఓయు క్యాంపస్‌లో యంగ్ పోయెట్స్ వర్క్ షాప్ జరగనుంది. ఈ సభలో దియా విఘ్నేశ్‌కు కుందుర్తి పురస్కార ప్రదానం, ఆనవాళ్లు 2024 ఆవిష్కరణ ఉంటాయి. సీతారాం, శీలా సుభద్రాదేవి, కాశీం, శ్రీరాం, అనిల్ డ్యానీ, యాకూబ్, నందిని సిధారెడ్డి, పేర్ల రాము, హాతీరాం పాల్గొంటారు.
కుందుర్తి కవిత, సమత
మాడభూషి రంగాచార్య స్మారక కమిటీ ద్విదశాబ్ది సభ
డా మాడభూషి రంగాచార్య స్మారక కమిటీ ద్విదశాబ్ది సభ ఈ నెల 14న సాయంత్రం 5.30 గంటలకు రవీంద్రభారతి, సమావేశ మందిరంలో జరుగుతుంది. ‘స్మరణ’ పుస్తకావిష్కరణ కూడా వుంటుంది. డా|| డి. చంద్రశేఖరరెడ్డి, నిఖిలేశ్వర్, డా|| ఏనుగు నరసింహారెడ్డి, సుధామ, డా|| నాళేశ్వరం శంకరం, డా|| బెల్లంకొండ సంపత్ కుమార్, డా|| జతిన్ కుమార్ పాల్గొంటారు.
డా.మాడభూషి రంగాచార్య స్మారక పురస్కార కమిటి
బుక్ ఫెయిర్‌కు పుస్తకాల ఆహ్వానం
డిసెంబర్ 19-29 వరకు జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో రచయితల పుస్తకాలు తెలంగాణ బుక్‌ట్రస్ట్ స్టాల్‌లో ప్రదర్శించేందుకు గాను రచయితలు తమ రచనలను (ప్రతి పుస్తకం 5 కాపీలు మాత్రమే) డిసెంబర్ 15వ తేదిలోపు సంప్రదించి, పుస్తకాలు తెలంగాణ బుక్‌ట్రస్ట్ కార్యాలయం అడ్రస్‌కు పంపగలరు. పూర్తి వివరాలకు: తెలంగాణ బుక్‌ట్రస్ట్ కార్యాలయం: ఇ.నెం. 1-1-80/15, మొదటి అంతసు,్త స్టీల్‌బ్రిడ్జ్ పిల్లర్ నెం.43, ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్-500020. ఫోన్: 72073 79241,కోయ చంద్రమోహన్, తెలంగాణ బుక్‌ట్రస్ట్
కవితలకు ఆహ్వానం
తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కవితా సంకలనం తీసుకువస్తుంది. సామాజికాంశాలపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కవులు 25 లైన్లకు మించకుండా కవితలను 7386046936, 9542806804 నెంబర్లకు వాట్సాప్ ద్వారా పంపగలరు. కవితల ఎంపికలో కమిటీదే తుది నిర్ణయం. కవితలు చేరాల్సిన చివరి తేదీ:డిసెంబర్ 20, 2025 వాట్సాప్ నంబర్లు: తెలంగాణ సాహితి, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ.
‘భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటీ – 2026
సమకాలీన సామాజిక సమస్యలు, మానవీయ విలువలు, వైవిధ్యమైన హాస్యం అంశాలతో కూడిన కథానికలకు, భూపతి చంద్ర’ మెమోరియల్ ట్రస్ట్ ఆహ్వానం పలుకుతోంది. నాలుగు పేజీలకు మించని కథానికలను 1, జనవరి 2026 లోపు పోస్టల్, కొరియర్ ద్వారా పంపాలి. చిరునామా : సమన్వయకర్త, ‘భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటి – 2026, ఆనంద నిలయం, ఇం.నం. 1-5-1020/4, బి.ఆర్.రావు నగర్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్-500010. ఫోన్: 9963616999. ఈమెయిల్ ఐడి :bcmkantha@gmail. com, వాట్సాప్: 9959020513
ఎమ్.ఎల్. కాంతారావు, ప్రజ్ఞాపురము.
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -


