Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక
2025 సంవత్సరానికి గాను ‘గారడివాడు’ కథా సంపుటి రచయిత కె.ఎ.ముని సురేష్‌ పిళ్లె శీలా వీర్రాజు కథానికా పురస్కారానికి, చిత్రకారుడు పి.ఎస్‌ చారి శీలా వీర్రాజు చిత్రకళా పురస్కారానికి ఎంపికయ్యారు. వీరికి నగదు, జ్ఞాపికతో జూన్‌ 7న సాయంత్రం 5.30 కు హైద్రాబాద్‌ రవీంద్రభారతి సమావేశమందిరంలో పురస్కార ప్రదానం జరుగుతుంది. శీలావీ చిత్రలేఖనాలపై పలువురు ప్రముఖులు రాసిన వ్యాసాల సంకలనం ‘ఒక చిత్రకారుడు – అనేక అవలోకనాలు’, ‘శీలాక్షరాలు’ గ్రంథాల ఆవిష్కరణ జరుగుతుంది. సభలో విహారి, మామిడి హరికష్ణ, ఇంద్రగంటి మోహనకష్ణ, డా.అమతలత, ఎమ్వీ.రామిరెడ్డి గార్లు పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం.
– శీలా సుభద్రాదేవి
కథలపోటీ ఫలితాలు
వాసా ఫౌండేషన్‌ సాహితీకిరణం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడిన వాసా ప్రభావతి స్మారక కథలపోటీ విజేతలు వరుసగా… 1. ఆఖరి కోరిక – డా||గురజాడ శోభాపేరిందేవి, 2. చిన్నచూపు- కె.రాజేశ్వరి. ఐదు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌ శ్రీత్యాగరాయ గానసభలో వాసాఫౌండేషన్‌/ కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ నిర్వహించే కార్యక్రమంలో బహుమతి ప్రదానం కావించబడును. – పొత్తూరి సుబ్బారావు, సంపాదకులు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img