Friday, December 26, 2025
E-PAPER
Homeఖమ్మంపల్లెల్లోనూ ప్రత్యక్ష పోలీస్ నిఘా

పల్లెల్లోనూ ప్రత్యక్ష పోలీస్ నిఘా

- Advertisement -

– వేడుకలు, వినోదాల్లో అపశృతులకు చెక్
– ప్రధాన కూడళ్ళలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్
– ప్రశాంతంగా పండుగ వేడుకలకు ప్రణాళిక
– ఎస్ హెచ్ ఓ ఎస్ఐ యయాతి రాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట

నూతన సంవత్సర వేడుకల్లో అపశృతులు నివారణకు చేపట్టే చర్యలు రేపటి నుండే అమలులోకి వస్తాయని,ఇందులో భాగంగా పల్లెల్లో నూ ప్రత్యక్ష పోలీస్ నిఘా( విజిబుల్ పోలీసింగ్ ) ఉంటుందని ఎస్.హెచ్.ఓ యయాతి రాజు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసారు. సంక్రాంతి మూడురోజులు పండుగ అయ్యేంత వరకు అశ్వారావుపేట పట్టణంలోనే కాక ప్రతీ ఊరు లోనూ పోలీస్ నిఘా ఉంటుందని అన్నారు. 

అశ్వారావుపేట లోని మూడు రోడ్ల ప్రధాన కూడలి,వినాయక పురం సెంటర్,ఊట్లపల్లి, అచ్యుతాపురం క్రాస్ రోడ్ లాంటి గ్రామాలను కలిపే అన్ని సెంటర్ లో డ్రంక్ డ్రైవ్ చెకింగ్ చేపడతామని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా కోడిపందాలు, పేకాట సోదాల్లో పెట్టుబడి కేసు నమోదు అయిన ప్రతీ ఒక్కరిని తిరిగి బైండోవర్ చేస్తామని తెలిపారు. ప్రతీ గ్రామానికి విలేజ్ పోలీస్ ఆఫీసర్ ను కేటాయించి పెట్రోలింగ్ చేస్తామని అన్నారు.నూతన సంవత్సరాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి అనేదే పోలీస్ లక్ష్యం అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -