Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు గాలి కుంటు టీకాలు వేయించాలి

పశువులకు గాలి కుంటు టీకాలు వేయించాలి

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
పశువులకు తప్పనిసరిగా గాలికుంట టీకాలు వేయించాలని  స్టేట్ మానిటరింగ్ టీం డాక్టర్ వెంకటయ్య గౌడ్, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్, ఏడి డాక్టర్ భాస్కర్ రెడ్డి పాడి రైతులకు సూచించారు. కల్వకుర్తి మండలం జీడిపల్లి గ్రామంలో మంగళవారం రోజు కల్వకుర్తి మండల పశువద్యాధికారి డాక్టర్ నాగరాజ్ తో కలిసి పశువులకు టీకాలు వేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో పాడి రైతులు తప్పనిసరిగా తమ పాడి పశువులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించే గాలికుంట టీకాలను వేయించాలని వారు కోరారు.

ఈనెల 14 వరకు కొనసాగే ఈ క్యాంపును మండలంలోని ప్రతి పాడి రైతు సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రాజు ప్రణీత ఆంజనేయులు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -