- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని డోంగ్లి మండల కేంద్రంలో శనివారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని డోంగ్లి గ్రామ సర్పంచ్ రేఖ శివాజీ పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ పశువైద్య డాక్టర్ వినీత్ కుమార్ మాట్లాడుతూ.. పశువులదారులు తప్పనిసరిగా గాలికుంటు నివారణ టీకాలు పశువులకు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశువుల దారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



