Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

- Advertisement -

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్
నవతెలంగాణ – మద్నూర్ 

పశువుల దారులు తమ తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకొని పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ పశువులదారులకు సూచించారు. డోంగ్లి మండలంలోని మొఘ గ్రామంలో పశు వైద్య , పశు సంరక్షక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలి కుంట వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్  హాజరవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా జరుగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ప్రతి ఒక్కరూ పశువులకు తీసుకొచ్చి టీకాలు వేయించి, పశువుల ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలిపారు. 109 ఆవులు, 52ఎడ్లు, 45 గేదెలు, దూడలు 37 మొత్తం 240 పశువులకు టీకాలు వేయడం  జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సిబ్బంది డాక్టర్ ఎం.వినీత్ కుమార్ మండల పశు వైద్యాధికారి డోంగ్లీ అలాగే సయ్యద్ మున్వీర్ అలీ పశువైద్య సహాయకులు, జి శేఖర్ దావకాన సాయకుడు, జి సైయాజీ గోపాలమిత్ర,జె నాగనాథ్ గోపాలమిత్ర, కె చంద్రశేఖర్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -