Tuesday, March 10, 2026
E-PAPER
Homeఖమ్మంపశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

- Advertisement -

మండల పశు వైద్యాధికారి ఎర్రగుంట్ల అన్వేష్
నవతెలంగాణ – బోనకల్ 

మండల పశు వైద్యశాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని  బోనకల్ గ్రామంలో మంగళవారం ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను మండల పశు వైద్యాధికారి ఎర్రగుంట్ల అన్వేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్వేష్ మాట్లాడుతూ బోనకల్ గ్రామంలో మొత్తం 96 పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రైతుల తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ టీకాలు వేయటం వలన పశువులు బలంగా ఉండటంతో పాటు పాడి పశువులు అయితే మరింత సురక్షితంగా ఉంటాయన్నారు. ఎటువంటి వ్యాధులు రాకుండా ఈ టీక నిరోధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు జ్యోతి, ఉపసర్పంచ్ బానోతు కొండ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరీదు శేషు, అంతోటి శ్రీను, షేక్ నాగులమీర, జర్పుల శ్రావణి, గ్రామ పంచాయతీ సెక్రటరీ కోలా రాజేశ్వరి, పశుసంవర్ధకశాఖ సిబ్బంది లైవ్ స్టాక్ అసిస్టెంట్ గరిడేపల్లి నాగేంద్ర కుమార్, రవికృష్ణ, వెంకటనారాయణ, శ్రీకాంత్, పశుమిత్ర త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -