నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ / బొమ్మలరామారం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోగల ధర్మారెడ్డిగూడెం గ్రామంలో ” వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయు గిడ్డంగులు, నిల్వ దాన్యం పై ఋణాలు” అనే అంశం పైన అవగాహన కార్యక్రమాన్ని జాతీయ మొక్కల ఆరోగ్య యజమానియా సంస్థ రాజేంద్రనగర్ – రైతు విజ్ఞాన కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ హైదరాబాద్ సహాయ సంచాలకులు డా. పి జ్యోతి మాట్లాడుతూ గిడ్డంగుల్లో నిల్వ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల పై ఋణాల పథకాలను వివరించారు.
వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ మరియు రెగ్యులేటరీ అథారిటీ, ఎలక్ట్రానిక్ నెగోటియాల్టీ ఆఫ్ వేర్ హౌస్ రిసిప్ట్ – గిడ్డంగి రసీదు చర్చల సామర్థ్యం) అంశాలను వివరించారు . మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేనప్పుడు, గిడ్డంగుల్లో నిల్వ చేసుకొని 8 నుంచి 9 శాతం వడ్డీతో ఋణం పొందవచ్చనారు. ఇతరులకు వ్యవసాయ ఉత్పత్తులను అమ్మినపుడు, ఋణం కూడ ఇతరులకు బదిలీ కాబడుతుందన్నారు. గ్రామంలోని గిడ్డంగులను వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు వాడి లబ్ధి పొందాలన్నారు. అనంతరం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.అనిల్ కుమార్ ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వరి, ప్రత్తి సాగులో అధిక దిగుబడికి పాటించవలసిన మెలకువలను తెలియజేసారు. మైలారం గ్రామంలోని గిడ్డంగులను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతులు రాజేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, బాల్ రెడ్డి, దేవా రెడ్డి, చంద్రా రెడ్డి, కంచి మల్లయ్య , మహిళా రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయ ఉత్పత్తులపై ఋణాల పథకాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES