Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేనేత కార్మికులకు రూ.19.24 కోట్ల రుణమాఫీ..

చేనేత కార్మికులకు రూ.19.24 కోట్ల రుణమాఫీ..

- Advertisement -

జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

జిల్లాలో 2380 చేనేత కార్మికులు  19.24 కోట్లు రుణమాఫీకి అర్హత సాధించారని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. శుక్రవారం ఆయన రుణమాఫీపై అధికారులతో జిల్లా సమావేశం నిర్వహించి, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన  చేనేత కార్మికుల వ్యక్తి గత  రుణమాఫీ పథకంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికులు ఏప్రిల్ 1, 2017 నుంచి మార్చి 31, 2024 వరకు  39 బ్యాంకులలో తీసుకున్న రుణాల వివరాలను సేకరించి అర్హత గల కార్మికుల జాబితాను సిద్ధం చేశారు.

ఈ జాబితాను  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అధ్యక్షతన జరిగిన  జిల్లా స్థాయి కమిటీ ఆమోదించి,రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించినట్లు తెలిపారు. ఈ జిల్లాస్థాయి సమావేశంలో ఆర్ డి డి (హెచ్ఎంటి) పద్మ , హైదరాబాద్ జిఎం  నర్మద, డీసీసీబీ, నల్లగొండ యాదాద్రి లీడ్ బ్యాంకు మేనేజర్ కె.శివ రామ కృష్ణ, ప్రవీణ్ కుమార్, నాబార్డ్ డి సి ఏ ఓ, డిడిఎం , యాదాద్రి, హ్యాండ్లూమ్స్ ఏడి శ్రీనివాస్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -