నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
రైతులకు డిజిటల్ రికార్డుల ఆధారంగా రుణాలు మంజూరు చేయాలని అన్ని బ్యాంకులకు సూచించామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రుణాల మంజూరు కోసం బ్యాంకులు రైతుల పట్టాదార్ పాస్ బుక్కులను తమ వద్ద అట్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదని, పాస్‌బుక్ పేరుతో దరఖాస్తుదారులకు రుణాలను తిరస్కరించకూడదని అన్నారు. భూ భారతి చట్టం – 2025 లోని సెక్షన్ 10(6), సెక్షన్ 10(7) ల ప్రకారం, భూములపై రుణాలను మంజూరు చేసే సందర్భంలో భూ హక్కుల రికార్డులను ఉపయోగించి రుణాలను ప్రాసెస్ చేయాలన్నారు. రుణాల కోసం బ్యాంకులు రైతులకు సంబంధించిన పట్టా పాస్‌బుక్ -కమ్- టైటిల్ డీడ్‌ను తమ వద్ద ఉంచుకోవాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను అత్యవసరంగా పరిగణిస్తూ, వెంటనే అమలు చేయాలని బ్యాంకర్లకు ఉత్తర్వులు జారీ చేశామని ఆయన తెలిపారు.
డిజిటల్ రికార్డుల ఆధారంగా రుణాలు మంజూరు చేయాలి..బ్యాంకర్లకు కలెక్టర్ సూచన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES