Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్థానిక సంస్థల ఓటర్ల జాబితా సవరణ వాయిదా వేయాలి

స్థానిక సంస్థల ఓటర్ల జాబితా సవరణ వాయిదా వేయాలి

- Advertisement -

– రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

స్థానిక సంస్థల ఓటర్ల జాబితా సవరణను తక్షణమే వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, దాసోజు శ్రవణ్‌ కుమార్‌ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు లేఖను సమర్పించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్న ప్రజలు, ఓటరు జాబితాలో తమ వివరాలు సరిచూసుకోలేరని తెలిపారు. ఆ ప్రాంతాల్లో ప్రజలు, అధికారులు ఈ ప్రక్రియలో పాల్గొనడం అసాధ్యమని చెప్పారు. చాలా వరకు పంచాయితీ కార్యాలయాలు నీళ్లలో మునిగిపోయాయని తెలిపారు. ప్రజలు పూర్తిస్థాయిలో పాల్గొనే పారదర్శక వాతావరణంలో మరోసారి జాబితా ప్రక్రియ చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో అకస్మాత్తుగా వచ్చిన వరదలతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయనీ, వేలాది పశువులు మృత్యువాత పడ్డాయని, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వివరించారు. ఓటర్ల జాబితా సవరణకు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు కేవలం ఐదు రోజుల గడువు ఇవ్వడం సరికాదని వారు పేర్కొన్నారు. రాబోయే 3 నుంచి 5 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ఈ ప్రక్రియలో ప్రజలు గానీ, అధికారులు పాల్గొనలేరని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -